బీజేపీలో చేరిన వార్డు సభ్యులు
MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బీజేపీలో చేరారు. వార్డు సభ్యులు రాథోడ్ రాజేష్, రాథోడ్ శిల్పలతో పాటు పలువురు యువకులు బుధవారం జన్నారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు మధుసూదన్ రావు సమక్షంలో BJP పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కొంతం శంకరయ్య, బద్రీ నాయక్ పాల్గొన్నారు.