'పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా'
E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన 9 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5,16,850 విలువ గల చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు సోమవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిది భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దా దుర్గా ప్రసాద్, కాకర్ల సత్యేంద్ర కూచిపూడి గణపతి, తదితరులు పాల్గొన్నారు.