'న్యాయం జరిగే వరకు పోరాడుతాం'

'న్యాయం జరిగే వరకు పోరాడుతాం'

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన శేఖర్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజ్ భూపాల్ అన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ వేదింపులు, ప్రలోభాల కారణంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.