దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
విజయనగరం రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల నుంచి బ్యాగులు, మొబైల్స్ దొంగతనం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపారు. చందకపేట గ్రామానికి చెందిన ఐ.రాజును అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి రూ. 4,40,000 విలువ చేసే బంగారం, రూ. 1,50,000 విలువగల మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.