ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి

ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి

NRML: మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని, ఆయన చూపిన సత్యం, ధర్మం, కర్తవ్య మార్గాలు నేటి సమాజానికి కూడా ప్రేరణ కలిగిస్తాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక, నైతిక విలువలను ప్రతిఒక్కరు తమ జీవితంలో ఆచరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.