యూరియా కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు

VKB: జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో యూరియా దొరకడం లేదని రైతుల ధర్నా నిర్వహించారు. రైతులతో మాట్లాడడానికి ఎస్సై రమేశ్ రావడంతో ఓ రైతు ఆవేదనకు లోనై ఆయన కాళ్లపై పడ్డాడు. ఎరువుల కొరత కారణంగా పంటలు నాశనం అవుతున్నాయని, ఇప్పటికైనా సరిపడా యూరియా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.