‘అసంపూర్తిగా ఆగిపోయిన కేజీబీవీ ఆదనపు భవనాలను పూర్తి చేయాలి'

KRNL: దేవనకొండలోని కేజీబీవీ పాఠశాలలో అసంపూర్తిగా ఆగిపోయిన ఆదనపు భవనాలను పూర్తి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ప్రభుత్వ విద్యా సంస్థలు లేక విద్యా ప్రమాణస్థాయి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.