'బీమాతో కుటుంబం ధీమాగా బతుకుతుంది'
KNR: కరీంనగర్ 8వ డివిజన్, అలుగునూర్‌లో శ్రీ ఆంజనేయ పురుషుల పొదుపు సహకార సంఘం సభ్యులు ఇటీవల మృతి చెందిన సిల్ల భూమయ్య, బత్తిని రవీందర్ కుటుంబాలకు బీమా నగదును ఇచ్చారు. భూమయ్య భార్య పద్మకు రూ. 1,35,000, రవీందర్ భార్య స్వరూపకు రూ. 86,669 సంఘం అధ్యక్షులు చౌదరి పరశురాములు అందజేశారు. పొదుపుతో బీమా ధీమాగా ఉంటుందని ఆయన వివరించారు.