VIDEO: బాణ సంచా నిల్వలపై దాడులు
VSP: విశాఖలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాపై బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. న్యూపోర్ట్ పరిధిలోని వడ్ర అప్పలరాజు వద్ద రూ40 వేలు, గాజువాక హైస్కూల్ రోడ్‌కు చెందిన బొద్దు గాంధీ వద్ద రూ.1 లక్ష విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.