గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
బాపట్లలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. గురువారం గోడౌన్ వద్ద రిజిస్టర్ తనిఖీ చేసి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు.