అప్పుడు ఇప్పుడు.. YCP తీరు మారలేదు: పవన్

అప్పుడు ఇప్పుడు.. YCP తీరు మారలేదు: పవన్

AP: అధికారం పోయాక కూడా YCP నేతలు దిగజారుడు మాటలే మాట్లాడుతున్నారంటూ Dy.CM పవన్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని.. విమర్శలను స్వీకరించలేకుంటే న్యాయపరంగా పోరాడాలి కానీ దాడులు సమాధానం కాదని హితవు పలికారు. భార్యను కారుతో పోల్చిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు మర్చిపోలేదని, తమ పాలనలో చంద్రబాబు భార్యను అసభ్యంగా మాట్లాడితే జగన్ ప్రోత్సహించారని పేర్కొన్నారు.