మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

SRPT: మున్సిపల్ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ ఇచ్చి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని, ప్రతి ఓటును నిబంధనల ప్రకారమే లెక్కించాలని స్పష్టం చేశారు. పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.