VIDEO: కొత్తపల్లిలో పార్టీ జెండా దిమ్మలకు ముసుగు తీయరా!
NLG: 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో SEC స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసింది. గత నెల 9న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేసింది. అయినప్పటికీ, మండలంలోని కొత్తపల్లి స్టేజి సమీపంలో ఉన్న పార్టీ దిమ్మలకు ముసుగు తొలగించలేదు. నోటిఫికేషన్ రాగానే హడావిడి చేసిన అధికారులు ఇప్పుడెందుకు తొలగించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.