రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.