'ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి'

NTR: విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం డ్యామ్ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతుందని, దీంతో పులిచింతల డ్యామ్ ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద 5-6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని, పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.