గుంతల రహదారితో ఇబ్బందులు పడుతున్న స్థానికులు

గుంతల రహదారితో ఇబ్బందులు పడుతున్న స్థానికులు

NTR: వీరులపాడు మండలం పల్లంపల్లి నుంచి దాములూరు వైపు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీవర్షాలకు రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో మరింత అద్వానంగా రహదారి మారిందని స్థానికులు వాపోయారు. కనీసం రహదారికి మరమ్మతులు కూడా చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు.