కూరగాయల మార్కెట్‌ను పట్టించుకొండి సారూ..!
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ అధ్వానంగా మారింది. చెత్తాచెదారం, మురుగు పేరుకుపోయిందని స్థానికుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతోందని వ్యాపారులు, కొనుగోలుదారులు మండిపడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు. లేకుంటె కలెక్టర్‌కు వినతులు అందజేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.