VIDEO: విరుపాక్షి దేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం

CTR: సోమల మండలం గల్లా వారి పల్లెలో ఘనంగా విరుపాక్షి దేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. శుక్రవారం గ్రామ దేవతల వద్ద పూజలు చేసి ప్రతిష్ఠ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఆలయం వద్ద గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పూజది కార్యక్రమాలు జరుగుతాయని గ్రామస్థులు తెలిపారు.