నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

WGL: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు.