కెనడాలో భారత సంతతి వ్యక్తికి పాతికేళ్ల జైలు శిక్ష

కెనడాలో భారత సంతతి వ్యక్తికి పాతికేళ్ల జైలు శిక్ష

కెనడాలో జరిగిన ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తి బాల్‌రాజ్ బస్రా(25)కు బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022 అక్టోబర్ 17న విశాల్ వాలియా(38)ను కాల్చి చంపి, వాహనంలో అతడికి నిప్పు పెట్టిన కేసులో బస్రాకు శిక్ష పడింది. ఈ కేసులో ఇక్బాల్, డియాండ్రెకు ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.