కోడిపందాలు ఆడుతున్న 18 మంది అరెస్ట్

కోడిపందాలు ఆడుతున్న 18 మంది అరెస్ట్

ప్రకాశం: ఒంగోలు మండలంలోని దేవరం పాడు గ్రామ సమీపంలో కోడిపందాలు ఆడుతున్న 18 మందిని స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కోడిపందాలు ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.19,100 నగదు, 9 కోళ్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న 18 మందిని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.