కోడుమూరులో ఉద్రిక్తత వామపక్షనాయకులు అరెస్ట్

కోడుమూరులో ఉద్రిక్తత వామపక్షనాయకులు అరెస్ట్

కర్నూల్: కోడుమూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కోడుమూరుకు రానున్న నేపథ్యంలో కోడుమూరుకు చెందిన వామపక్ష పార్టీల నాయకులు రాజు, గపూర్మియా, వీరన్న కోడుమూరుకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేశారు.