ఉట్నూర్‌లో పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం పర్యటించారు. గురువారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.