పోలింగ్ నిర్వహణలో మిస్టేక్స్ చేయవద్దు: కలెక్టర్
VKB: పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగే సమయాల్లో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వవద్దని ఎన్నికల నిర్వహణ అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. తాండూర్ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది పోలింగ్ బ్యాలెట్ సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం వరకు పోలింగ్ సరైన విధంగా నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.