ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
RR: రాజేంద్రనగర్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు వద్ద ఓ మోటర్‌సైకిల్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అబ్దుల్ సోహెద్(20), షేక్ సాహిల్(17) అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వీరిద్దరు ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్న కార్మికులుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.