కోటగుళ్లలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
BHPL: గణపురంలోని కోటగుళ్లలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం కోటగుళ్లను భక్తులు సందర్శించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలను అందజేశారు.