ఆరోగ్య కేంద్రంలో 71 మందికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో 71 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు మాతా శిశు సంరక్షణ అధికారి, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో డా. ముస్కు జైపాల్ రెడ్డి తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆవశ్యకతపై గ్రామాల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు.