నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

TPT: నాయుడుపేట టౌన్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ మరమ్మత్తుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ ఏఈఈ ఎన్. శివశంకర్ తెలిపారు. అదేవిధంగా సప్తగిరి ఫీడర్‌లో అత్యవసర పనుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. దీనికిగాను ప్రజలు సహకరించాలని కోరారు.