కుటుంబ కలహాలతో సీఐటీయు ప్రధాన కార్యదర్శి ఆత్మహత్య

కాకినాడ: ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బేత రాజులోవ తన పొలంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమండ్రిలో నివాసముంటున్న రాజులోవ శుక్రవారం సాయంకాలం తన స్వగృహం రామకృష్ణాపురం వచ్చాడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.