నేడు విచారణకు హాజరుకానున్న పోచారం

నేడు విచారణకు హాజరుకానున్న పోచారం

NZB: పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రెండో రోజు విచారణ చేపట్టనున్నారు. నిన్న తెల్లం వెంకటేశ్వర్లు, సంజయ్ పిటిషన్లపై విచారణ జరిగింది. నేడు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై దాఖలైన పిటిషన్‌ను స్పీకర్ విచారించనున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ విచారణలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.