నుదురుపాడులో దోమల నివారణ దినోత్సవ ర్యాలీ

GNTR: ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, దోమ తెరలు, పిచికారీ ద్వారా దోమలను సమర్థంగా నివారించవచ్చని డా. యాన్ని గ్రేస్ తెలిపారు. అనంతరం ఆరోగ్య సూపర్‌వైజర్ కె. సుదర్శన్ రాజు, సీహెచ్‌వో లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.