'అడెల్లి ఆలయ పరిసరాల్లో జంతు బలి నిషేధం'
NRML: జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన సందర్భంగా, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు ఆలయ పరిసరాల్లో జీవబలిని నిషేధించినట్లు ఇన్ఛార్జ్ కార్యనిర్వాహణ అధికారి భూమయ్య తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఈ నిర్ణయం ఆలయ ఉత్సవాల నేపథ్యంలో తీసుకోబడిందన్నారు.