'దరఖాస్తుదారుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి'

PDPL: సింగరేణి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ. నరేష్ విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలో పర్సనల్ మేనేజర్‌కు నాయకులు శనివారం వినతి అందజేశారు. మెడికల్ బోర్డులో లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ. నరేష్, ఈ. రామకృష్ణ పాల్గొన్నారు.