జిల్లాస్థాయి డీఆర్పీల నియామకం

SRD: వేసవిలో ఉపాధ్యాయుల శిక్షణ కోసం డీఆర్పీలను నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల కోసం 13 మందిని, స్కూల్ అసిస్టెంట్‌ల కోసం 57 మంది డీఆర్పీలను నియమించినట్లు పేర్కొన్నారు. డీఆర్పీలుగా నియామకమైన వారు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.