మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చేయూత
KMR: బిక్కనూర్ మండలంలోని బాగిర్తిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, నాగలక్ష్మి భర్త స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని,మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తక్షణ సహాయం కింద 15 వేల రూపాయలను, మండల పార్టీ నాయకులకు అందజేశారు.ఈ మేరకు శనివారం బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నాగలక్ష్మికి రూ. 15,000 అందజేశారు.