VIDEO: జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమం

VIDEO: జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమం

బాపట్ల కలెక్టరేట్‌లో బుధవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ప్రచార ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.