బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

BHPL: బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్ర వచ్చిందని, వారి ఆశయాలను కొనసాగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.