VIDEO: మిర్యాలగూడలో 4 లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన
NLG: మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం మిర్యాలగూడ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 4 లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, 5 కోట్ల రూపాయల వ్యయంతో KNM డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.