శ్రీ కుర్రాజులు-పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవాలు
BDK: దమ్మపేట మండలం మల్లారం గ్రామ ఆదివాసి నాయకపోడు పెద్దలు, యువత ఆధ్వర్యంలో శ్రీ కుర్రాజులు, పెద్దమ్మ తల్లి జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జరిగే ఈ జాతర గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. గత 3 రోజులుగా నాయకపోడు సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగాయి.