ఉత్తమ ఉపాధ్యాయునిగా చంద్రరావు ఎంపిక

ఉత్తమ ఉపాధ్యాయునిగా చంద్రరావు ఎంపిక

VZM: విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గజపతినగరం మండలం మర్రివలస పాఠశాల ఉపాధ్యాయుడు కనకల చంద్రరావును విజయనగరంలోని మాతృభూమి స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు ఎన్‌విఎన్ బ్లడ్ బ్యాంక్ వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. గురుపూజోత్సవం పురస్కరించుకొని శుక్రవారం విజయనగరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నారు.