నల్గొండ: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత

నల్గొండ: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కన్నుమూత

నల్గొండ: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. నల్గొండ (D) మిర్యాలగూడలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు.