'పుష్కరాలకు మౌలిక సదుపాయాలపై దృష్టి'

'పుష్కరాలకు మౌలిక సదుపాయాలపై దృష్టి'

E.G: గోదావరి పుష్కరాలకు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. 2027లో జరిగే పుష్కరాలకు అధికార యత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, చేపట్టవలసిన పనులు, అంచనా వ్యయంపై ప్రతిపాదనలు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు.