భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయం
VZM: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గజపతినగరం మండలం పురిటి పెంట సంతతోట శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ అర్చకులు పెరుమాల మణికంఠశాస్త్రి పంచామృతాలతో అభిషేకం చేశారు. . కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన సోమవారం పూజలు నిర్వహిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. మండలంలో పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.