వరకట్నం వేధింపులు.. కేసు నమోదు
NDL: కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె గ్రామంలో ఇవాళ షేక్ సబీనా బేగం అనే మహిళపై భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన భర్త అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారిపై వరకట్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు వెల్లడించారు.