'ఆరోగ్యం బాగానే ఉంది'
AKP: ఆరోగ్యం బాగానే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తీవ్ర అలసటతో అసెంబ్లీ సమావేశాల్లో గురువారం స్పృహ తప్పడంతో సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అలసట కారణంగా చిన్న ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.