నీట మునిగిన 5046 హెక్టార్లలో వరి
TPT: దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరి పంట 5046 హెక్టార్లలో నీట మునిగిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. వరినారు 250 ఎకరాలు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇవాళ సాయంత్రానికి నీరు తగ్గాక పూర్తి అవగాహన వస్తుందని ఆయన తెలిపారు. వరి నారు నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.