శ్రీవారి ఆలయానికి అంబానీ భారీ విరాళం
TPT: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ శ్రీవారి ఆలయాలను సందర్శించి భారీ విరాళాలు అందించారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్లు విరాళమిచ్చారు. ఈ నిధులతో రోజుకు వేలాది భక్తులకు అన్నప్రసాదం అందించే వంటశాల విస్తరణకు ఉపయోగించనున్నారు. అంబానీ కుటుంబం తరచుగా తిరుమల ఆలయానికి విచ్చేసి సేవా కార్యక్రమాలకు సహకరిస్తోంది.