జమ్మలమడుగు అర్బన్ నూతన సీఐగా నరేష్ బాబు

జమ్మలమడుగు అర్బన్ నూతన సీఐగా నరేష్ బాబు

KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐగా నరేష్ బాబు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ లింగప్ప బద్వేల్‌కి బదిలీపై వెళ్లారు. సీఐ నరేష్ బాబు మాట్లాడుతూ.. జమ్మలమడుగులో మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. యువత గంజాయి, జూదం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.