పెరిగిన నిమ్మ ధరలు.. రైతులకు ఊరట
KDP: జిల్లా మార్కెట్‌లో నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఊరట చెందుతున్నారు. గతంలో కిలో నిమ్మకాయలు రూ.110-రూ.80కు పడిపోయాయి. వేసవి నేపథ్యంలో నిమ్మకాయలకు వివిధ రాష్ట్రాల మార్కెట్ల పరిధిలో గిరాకీ పెరగడంతో జనవరిలో లూజు నిమ్మకాయల బస్తా రూ.500 పలికింది. ప్రస్తుతం టన్ను నిమ్మకాయలు రూ.9200 పలుకుతున్నాయి. నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.