నేడు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం ప్రారంభం

VSP: పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీవో మీనాకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో 107 మందికి టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.